News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Similar News

News March 4, 2026

ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

image

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.

News March 4, 2026

MBNR: ఈనెల 8వ తేదీకి సదస్సు వాయిదా

image

10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. MBNRలో MAR 5న జరగాల్సిన ఈసదస్సు అనివార్య కారణాలతో MAR 8న(ఆదివారం) నిర్వహించనున్నారు. MBNR రైల్వేస్టేషన్ రోడ్డులోని సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో ఉ.10.30కి దీనిని నిర్వహించనుండగా CBI EX JD లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ హాజరుకాగలరు.

News March 4, 2026

నెల్లూరు: మహిళలకు ఆత్మరక్షణపై శిక్షణ

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సామూహిక ఆత్మరక్షణ శిక్షణ బుధవారం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో కరాటే నిపుణులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు ప్రత్యక్షంగా వివరించారు.