News April 13, 2024
కుక్క మృతి కేసులో హైకోర్టు మెట్లెక్కిన నటి

బాలీవుడ్ నటి ఆయేషా జుల్క.. కుక్క విషయంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మూగ జీవాలపై ప్రేమతో ఆమె వీధి కుక్కలను సంరక్షిస్తున్నారు. తన దగ్గర ఉన్న వాటిల్లో రాఖీ అనే కుక్క 2020 సెప్టెంబరులో చనిపోయింది. 2021లో ఛార్జ్‌షీట్ నమోదు చేసిన పోలీసులు కుక్కల కేర్ టేకర్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత అతడు బెయిల్‌పై బయటకు రాగా ఆ కేసు ముందుకు సాగలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటా తాజాగా ఆమె బాంబే హైకోర్టు మెట్లు ఎక్కారు.
Similar News
News March 14, 2026
SIDBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) 3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, CA, CFA, MBA, PGDM అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 18 వరకు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in
News March 14, 2026
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు

AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పని చేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు’ అని ట్వీట్ చేశారు.
News March 14, 2026
కల్తీపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్: మంత్రి

AP: పాలు, నెయ్యి, వెన్నలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాలు కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. కొనేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్ సరిచూసుకోవాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1100, 1800 425 3857కు కాల్ చేయాలన్నారు. కల్తీపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని ట్వీట్ చేశారు.


