News November 19, 2025
భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు: ఎంపీ

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఉన్న వనరులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు ఎంపీ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Similar News
News March 23, 2026
బాపట్ల: గ్యాస్ సమస్యలపై ఫిర్యాదు చేయండి

బాపట్ల జిల్లాలో 6వేలకు పైగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా స్పష్టం చేశారు. పట్ణణాల్లో 25 రోజులు, పల్లెల్లో 45రోజుల తర్వాతే గ్యాస్ బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ అయిన వారంలోపు సిలిండర్లు ఇస్తారని చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వచ్చే వార్తలు నమ్మవద్దని ఆయన కోరారు. గ్యాస్ సరఫరాలో సమస్యలు ఉంటే 94932 47765కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
News March 23, 2026
తిరుమలలో 99% మంది చేసే తప్పు ఇదే.!

తిరుమల యాత్ర అంటే వడ్డీకాసులవారే కాదు. వరాహ దర్శనం, పవిత్ర పుష్కరిణి స్నానం. తిరుమలలో మొదట వరాహ స్వామిని దర్శించుకోవాలని ఆ శేషమూర్తే పేర్కొన్నారట. స్థల పురాణం తెలియక 99% మంది భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. పుష్కరిణిలో స్నానం ఆచరించకపోయినా, ముఖం, కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని వరాహ స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి దర్శనానికి వెళ్తే కోరిన కోర్కెలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.
News March 23, 2026
ఈ నెల 28 వరకు వర్షాలు!

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ జల్లులు పడతాయని అంచనా వేసింది.


