News November 19, 2025
భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు: ఎంపీ

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఉన్న వనరులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు ఎంపీ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Similar News
News March 12, 2026
హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్

పాత ఆస్తి పన్ను బకాయిలు ఉన్న నగరవాసులకు జీహెచ్‌ఎంసీ భారీ ఊరటనిస్తూ OTS పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారు మాత్రమే పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, MyGHMC యాప్, మీసేవ కేంద్రాల ద్వారా తమ బకాయిలను చెల్లించవచ్చు.
SHARE IT
News March 12, 2026
బాపట్ల: జిల్లాలో ఇంటర్ పరీక్షకు 155 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ పరీక్షకు 155 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు ఇంటర్ పరీక్షకు 1,270 మంది హాజరు కావలసి ఉండగా 1115 మంది హాజరైనట్లు తెలిపారు. 155 మంది హాజరు కాలేదన్నారు. ఇంటర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
News March 12, 2026
GWMC మేయర్‌కో న్యాయం.. సామాన్య పౌరునికో న్యాయమా?

GWMC పన్ను వసూళ్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కాశిబుగ్గలో రూ.13 వేల బకాయి ఉన్న వృద్ధురాలి ఇంట్లో గ్యాస్ సిలిండర్లను సిబ్బంది సీజ్ చేయడం వివాదాస్పదమైంది. అదే సమయంలో మేయర్ సుధారాణికి చెందిన ఆస్తులు, వ్యాపార సంస్థలు రూ.లక్షల పన్ను బకాయిలున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయమా? అని నిలదీస్తున్నారు.


