News November 18, 2025
రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
Similar News
News November 19, 2025
సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.
News November 19, 2025
నాగర్‌కర్నూల్‌లో పెరిగిన చలి

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.2గా నమోదైంది. అమ్రాబాద్, తోటపల్లిలో 13.9, సిర్సనగండ్లలో 14.1 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


