News April 13, 2024
చిత్తూరు: పవన్ కళ్యాణ్ పై మిథున్ రెడ్డి విమర్శలు

భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పిఠాపురంలో పవన్ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి అక్కడ వంగాగీత బలమైన నేత అని, ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు తీసుకోని బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో వంగాగీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News April 23, 2025
సివిల్స్‌లో మెరిసిన పలమనేరు వాసి

UPSC తుది ఫలితాలలో చిత్తూరు జిల్లా వాసి సత్తా చాటాడు. పలమనేరుకు చెందిన రంపం శ్రీకాంత్ మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 904వ ర్యాంకు సాధించాడు. శ్రీకాంత్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఈ ఘనత సాధించడంతో జిల్లా వాసులు అతనికి అభినందనలు తెలిపారు.
News April 23, 2025
చిత్తూరు: నేడే 10 ఫలితాల విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా నేడు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది పరీక్షలు రాసిన 21,245 మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు తేలనుంది. ఫలితాల విడుదలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 21,245 మంది పరీక్ష రాయగా వారిలో 294 మంది ప్రైవేట్‌గా, 20,951 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాశారు.
News April 23, 2025
ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ వరకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించినట్లు చిత్తూరు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిస్వరన్ తెలిపారు. మంగళవారం ఫీజు కట్టడానికి చివరి రోజు కాగా ఇంటర్ బోర్డు శుక్రవారం వరకు ఫీజు గడువు తేదీని పొడిగించిందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.