News April 13, 2024
జాన్సన్ బంతి దెబ్బకు చూపు మసకబారింది: కోహ్లీ

ఆసీస్‌తో 2014లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో జాన్సన్ బౌలింగ్‌ను సవాలుగా తీసుకుని ఆడినట్లు ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పారు. ‘తొలి మ్యాచ్‌లో జాన్సన్ బంతి నా తలకు తగిలింది. ఎడమ కంటి చూపు కాస్త మందగించడం ప్రారంభమైంది. లంచ్ సమయంలో పోరాడాలా? ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవాలా? అని ఆలోచించా. జాన్సన్‌కు దీటుగా సమాధానం ఇవ్వాలనుకున్నా. చివరకు అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నా’ అని తెలిపారు. ఈ సిరీస్‌లో కోహ్లీ 4 శతకాలు బాదారు.
Similar News
News March 15, 2026
వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు నిర్వహించారు.
News March 15, 2026
‘ఉగాది’ పండుగ ఎప్పుడు?

అమావాస్య గడియలు ఉండటంతో తెలుగు కొత్త సంవత్సరాది ‘ఉగాది’ ఎప్పుడు జరుపుకోవాలనే అయోమయం కొందరిలో నెలకొంది. అయితే చైత్ర శుక్ల పాడ్యమి రోజైన ఈ నెల 19(గురువారం)నే ఉగాది జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 19న ఉదయం 6.52 గంటలకు ‘పరాభవ నామ సంవత్సరం’ మొదలవుతుందని పేర్కొంటున్నారు. అదేరోజు ఇంట్లో షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారుచేసి స్వీకరించాలని సూచిస్తున్నారు.
News March 15, 2026
TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


