News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 19, 2025
నేడు పుట్టపర్తికి మోదీ రాక

AP: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. బాబా మందిరాన్ని, మహాసమాధిని ఆయన సందర్శించనున్నారు. ఈ సందర్భంగా బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
News November 19, 2025
భారత్‌ను ప్రేమించే వాళ్లందరూ హిందువులే: మోహన్ భాగవత్

భారత్‌ను ప్రేమించే వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ దేశంగా ఇండియా ఉండటానికి అధికారిక డిక్లరేషన్ అవసరం లేదని, మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు దాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. అస్పాంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ‘హిందూ అనేది కేవలం మతపరమైన పదం కాదు. వేల ఏళ్ల నాగరికత గుర్తింపు. భారత్, హిందూ రెండూ పర్యాయపదాలు’ అని తెలిపారు.
News November 19, 2025
వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయవద్దు: వరంగల్ సీపీ

నేరగాళ్లు టెక్నాలజీని వాడుకొని నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం వరంగల్ మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను పోస్ట్ చేయవద్దని, ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆయన హెచ్చరించారు.


