News April 13, 2024
డాక్టర్ కొణిదెల రామ్‌చరణ్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇవాళ ఫ్యామిలీతో కలిసి చెన్నై వెళ్లిన చరణ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఈ గౌరవం అందడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకు గాను డాక్టరేట్ అందిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.
Similar News
News March 5, 2026
మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్‌లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
News March 5, 2026
ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.
News March 5, 2026
ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్‌కు గుడ్‌న్యూస్!

హార్ముజ్ నుంచి అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో INDతో పాటు మరికొన్ని దేశాలకు భారీ ఊరట లభించింది. త్వరలోనే మన షిప్స్ రవాణా మొదలవ్వొచ్చు. ఇక తమ నౌకాదళంతో హార్ముజ్‌లోని వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తామన్న US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. జలసంధిని నియంత్రించే అధికారం తమకుందని, US, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పింది.


