News November 19, 2025

మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News November 19, 2025

NTRలో 1,18,629 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ

image

ఎన్టీఆర్ జిల్లాలో 1,18,629 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మరికొద్ది సేపట్లో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ నిధులు జమ కానున్నాయి. మొత్తం రూ.79.72 కోట్లు ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.59.31 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ.20.41 కోట్లు మంజూరు అవుతున్నట్లు స్పష్టం చేశారు.

News November 19, 2025

నల్గొండ: తరుగు పేరిట దోపిడీ.. ఏదీ నిఘా?!

image

అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే.. రైతుల దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు 3 కేజీల తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చర్లపల్లికి చెందిన K.లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మగా సెంటర్ నిర్వాహకులు రికార్డులో నమోదు చేశారు. మిల్లు నుంచి వచ్చే తక్ పట్టీలో 137 బస్తాలు మాత్రమే ఉంది.

News November 19, 2025

ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

image

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.