News November 19, 2025
ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి: KMR SP

కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్, లాక్-అప్ రూమ్ సహా అన్ని విభాగాలను పరిశీలించారు. సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు వంటి అంశాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ASP చైతన్య రెడ్డి, CI రామన్, SHO రంజిత్ పాల్గొన్నారు.
Similar News
News November 19, 2025
NTRలో 1,18,629 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ

ఎన్టీఆర్ జిల్లాలో 1,18,629 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మరికొద్ది సేపట్లో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ నిధులు జమ కానున్నాయి. మొత్తం రూ.79.72 కోట్లు ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.59.31 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ.20.41 కోట్లు మంజూరు అవుతున్నట్లు స్పష్టం చేశారు.
News November 19, 2025
నల్గొండ: తరుగు పేరిట దోపిడీ.. ఏదీ నిఘా?!

అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే.. రైతుల దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు 3 కేజీల తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చర్లపల్లికి చెందిన K.లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మగా సెంటర్ నిర్వాహకులు రికార్డులో నమోదు చేశారు. మిల్లు నుంచి వచ్చే తక్ పట్టీలో 137 బస్తాలు మాత్రమే ఉంది.
News November 19, 2025
ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.


