News November 19, 2025

ఆన్‌లైన్‌లో అమ్మాయిలపై వేధింపుల్లో HYD ఫస్ట్!

image

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆన్‌లైన్‌లో చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపుల్లో దేశంలోనే HYD నం.1గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపడం, మార్ఫింగ్ ఫొటోలు పంపించడం, అమ్మాయికి నచ్చకపోయినా వరుసగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటి వేధింపులు ప్రధానంగా కనిపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది.

Similar News

News November 19, 2025

నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

image

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.

News November 19, 2025

సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

image

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

News November 19, 2025

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం

image

ఈ నెల 25న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాలక మండలి పదవీ కాలం కేవలం 2 నెలలు మాత్రమే ఉండటంతో పలు నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం కీలకం కానుందని సమాచారం. తమ డివిజన్లలో సమస్యలను పరిష్కరించాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశముంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ అధిక నిధులు విడుదల చేశారని.. తమకు కూడా విడుదల చేయాలని కోరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.