News November 19, 2025
మంచిర్యాల: ప్రయాణికుల కోసం దర్భాంగ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999)ను బుధవారం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు కాజీపేట మీదుగా ప్రయాణిస్తుంది. ఇది రామగుండం, మంచిర్యాల, చిల్పూర్, కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలు సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 20, 2025
తిరుమల: పోటు కార్మికులు కాదు.. ‘పాచక’లు

తిరుమలలోని శ్రీవారి పోటు కార్మికులు ప్రసాదాలు తయారు చేస్తుంటారు. ఇక్కడ పనిచేసేవారిని ప్రస్తుతం శ్రీవారి పోటు కార్మికులుగా పిలుస్తుంటారు. తాజాగా వీరికి కొత్త పేరు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. పోటు సూపర్‌వైజర్‌కు ముఖ్య పాచకగా, వర్కర్‌కు పాచకగా నామకరణం చేయాలని నిర్ణయించారు. గతంలో పోటు కార్మికులు టీటీడీ ఛైర్మన్‌ను కలిసి చర్చించడంతో పేర్లు మార్చనున్నారు.
News November 20, 2025
పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సహకంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహంపై దృష్టి సాధించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించారు. పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు, స్థానిక ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించే చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎగుమతుల అవకాశాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్‌నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.


