News November 19, 2025
బంధంలో సైలెంట్ కిల్లర్

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.
Similar News
News November 20, 2025
HALలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<
News November 20, 2025
హనుమాన్ చాలీసా భావం – 15

యమ కుబేర దిగపాల జహాఁ తే |
కవి కోవిద కహి సకే కహాఁ తే ||
యముడు, కుబేరుడు, దిక్పాలకులు వంటి దేవుళ్లే హనుమాన్ కీర్తిని సంపూర్ణంగా వర్ణించలేకపోయారు. సామాన్య కవులైతే అసలే వర్ణించలేని గొప్ప పరాక్రమవంతుడు ఆయన. మారుతీ శక్తిని కొలవడానికి మన ఆలోచనలు, పదాలు సరిపోవు. ఆయణ్ను ఎంత కీర్తించినా తక్కువే. అంతటి మహా వీరుడ్ని తలచకుంటే తప్పకుండా ఆయన వెంట ఉండి, కాపాడుతాడని నమ్మకం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 20, 2025
ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్‌తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్‌ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.


