News November 19, 2025

బాలకృష్ణతో మరో సినిమా: అంబికా కృష్ణ

image

ఏలూరు: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తో ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మంగళవారం రాత్రి వైజాగ్‌లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను అంబికా కృష్ణ సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ..బాలయ్యతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రేక్షకులు మెచ్చే కథ లభ్యమైతే బాలకృష్ణతో మరో చిత్రం నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం కథల అన్వేషణలో ఉన్నామన్నారు.

Similar News

News November 20, 2025

మదనపల్లె: పైపైకి టమాటా ధరలు.!

image

మదనపల్లెలో టమాటాల ధరలు రోజురోజుకూ పెరుగుతుండంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. బుధవారం మార్కెట్‌కు 140 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకురాగా.. హోల్ సేల్ వ్యాపారులు 10 కిలోల మొదటిరకం టమాటా బాక్స్‌ను రూ.550, రెండోరకం టమాటాలను రూ.520, మూడోరకం టమాటా బాక్స్‌ను రూ.430తో కొనుగోలుచేసినట్లు సెక్రటరీ జగదీశ్ మీడియాకు తెలిపారు.

News November 20, 2025

బిక్కనూర్: డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్

image

డిసెంబర్ 11న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

News November 20, 2025

HALలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<>HAL<<>>)లో 9 డిప్లొమా టెక్నీషియన్, టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్లొమా, NTC+NAC(ITI) అర్హతగల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in