News April 13, 2024
రేపు తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటన

తెనాలి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి వస్తారని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో అనారోగ్యం వలన పవన్ తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
Similar News
News July 6, 2025
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి: ఎస్పీ

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపులు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థతో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
News July 6, 2025
తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్‌ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్‌లు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తారని తెలిపారు.
News July 6, 2025
గుంటూరు: లోక్ అదాలత్‌లో 10,698 కేసులు పరిష్కారం

గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ సాధ్యమైన కేసులను పరిష్కరించారు. వాటిలో సివిల్ కేసులు 1,041, క్రిమినల్ 9,580, ప్రీలిటిగేషన్ 77, మొత్తం 10,698 కేసులు ఉన్నాయి. పరిష్కరించిన కేసుల విలువ మొత్తం రూ.50.96 కోట్లు ఉందని జడ్జి చక్రవర్తి తెలిపారు.