News April 13, 2024

‘మేఘా’పై FIR నమోదు చేసిన సీబీఐ

image

HYD సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌పై సీబీఐ FIR నమోదు చేసింది. జగదల్‌పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ పనులకు సంబంధించి ₹174 కోట్ల బిల్లులను క్లియర్ చేయించుకోవడానికి 8 మంది NISP, NMDC అధికారులకు కంపెనీ ₹78 లక్షల లంచం ఇచ్చినట్లు తేలింది. దీంతో వారిపైనా కేసు నమోదయ్యింది. కాగా ₹966 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి.. రెండో అతిపెద్ద కంపెనీగా మేఘా నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2024

రోజూ 10 నిమిషాలైనా నవ్వుతున్నారా?

image

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నవ్వడమే మానేశారు. జోక్ వింటేనో, కామెడీ చూస్తేనో నవ్వుతున్నారు. రోజుకు 10 నిమిషాలైన నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నవ్వడం వల్ల గుండెకు వ్యాయామం జరిగి హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నవ్వడంతో ఎండార్ఫిన్లు విడుదలై శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

News November 16, 2024

మంత్రి హామీ.. RTC ఉద్యోగుల ధర్నాలు వాయిదా

image

AP: ఈ నెల 19, 20 తేదీల్లో చేపట్టాల్సిన నిరసనలను ఎంప్లాయీస్ యూనియన్ వాయిదా వేసుకుంది. RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీతో ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు EU పేర్కొంది. RTC ఉద్యోగుల అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

News November 16, 2024

మణిపుర్‌లో మళ్లీ హింస.. కర్ఫ్యూ విధింపు

image

మ‌ణిపుర్‌లో మ‌ళ్లీ క‌ర్ఫ్యూ విధించారు. జిరిబ‌మ్ ప్రాంతంలో మిలిటెంట్లు ఆరుగురు కుటుంబ స‌భ్యుల‌ను కిడ్నాప్ చేసి హ‌త‌మార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్ల‌పైకొచ్చి నిర‌స‌న చేప‌ట్టారు. ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల‌ను ముట్ట‌డించి దాడి చేశారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు తీవ్రం కావ‌డంతో ఏడు జిల్లాల్లో అధికారులు క‌ర్ఫ్యూ విధించారు. ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేశారు.