News November 19, 2025
మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 20, 2025
రాజకీయ లబ్ధికోసం KTRపై అక్రమ కేసులు: హరీశ్

HYD బ్రాండ్ ఇమోజీని పెంచిన KTRపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న KTRపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధిపొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
News November 20, 2025
సిరిసిల్ల: శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి రామ్ దాసు తెలిపారు. PMSRI పాఠశాలల్లోని విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు 11 సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకులు కావాలని పేర్కొన్నారు. కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలారి పాయట్టులో అనుభవం ఉన్న శిక్షకులు ఈ నెల 25 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మంచిర్యాల- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

మంచిర్యాల- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మార్గంలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. రూ.2, 250 కోట్ల వ్యయంతో 68 కిలోమీటర్ల మేర ఈపీసీ పద్ధతిలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 317 హెక్టార్ల భూసేకరణ చేస్తారు. రహదారి నిర్మాణంతో ప్రయాణ సౌలభ్యం, వ్యవసాయ, వ్యాపార రవాణాకు దోహదపడనుంది.


