News April 13, 2024
19న మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్

పుంగనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ కార్యాలయం శనివారం తెలిపింది. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News January 14, 2026
CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.
News January 14, 2026
చిత్తూరు జిల్లాలో 62 బస్సులకు జరిమానా

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్లు చెప్పారు. పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వసూళ్లు చేశామన్నారు.
News January 14, 2026
చిత్తూరు కోర్టులో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లా కోర్టులో పర్మినెట్ ఉద్యోగాల నియామకానికి ప్రధాన న్యాయమూర్తి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రికార్డు అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తుకు చేసుకోవాలి. అర్హత, జీతం తదితర వివరాలకు చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలి.


