News April 13, 2024

BRS వల్ల నా కుటుంబం చీలిపోయింది: కేకే

image

TG: BRSపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీతో తనకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌లో నాకు కనీసం సీనియర్ అన్న గుర్తింపు ఉండేది. BRSలో అదీ లేదు. నా కొడుకు విప్లవ్‌కు MLC అడిగితే ఇవ్వలేదు. ఆ పార్టీ వల్ల నా కుటుంబం చీలిపోయింది. నా కొడుకు వయసున్న కేటీఆర్ నాపై చేసిన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాష్ట్రం వాళ్ల తాత జాగీరా?’ అని ప్రశ్నించారు.

Similar News

News March 10, 2026

US-ఇరాన్‌ పోరు.. LICకి ₹70వేల కోట్లు నష్టం

image

అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ పోరుతో LIC భారీగా నష్టపోయింది. FEB 27 నాటికి ₹14.88 లక్షలకోట్లుగా ఉన్న ఆ సంస్థ పెట్టుబడులు.. మార్చి 9 నాటికి 4.7% (₹70,105కోట్లు) తగ్గి ₹14.17లక్షల కోట్లకు చేరాయి. ఏస్ ఈక్విటీ సంస్థ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కేవలం SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం వల్ల LICకి ఏకంగా ₹15,293కోట్లు (21.8%) లాస్ వచ్చింది. ఇక L&Tలో ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ₹7,609కోట్లు నష్టపోయింది.

News March 10, 2026

జాబ్ హగ్గింగ్.. ఏంటిది?

image

కరోనా తర్వాత ‘క్వైట్ క్విట్టింగ్’, ‘కెరీర్ కుషనింగ్’ వంటి ట్రెండ్స్ చూశాం. ఇప్పుడు ‘జాబ్ హగ్గింగ్’ వంతు. అంటే.. ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేకపోయినా, గ్రోత్ లేకపోయినా.. ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్స్ భయంతో ఉన్నా.. దాన్నే గట్టిగా పట్టుకొని ఉండటం. ఇది కంపెనీపై ప్రేమతో చేసేది కాదు. బయట పరిస్థితులు బాగోలేక భద్రత కోసం తీసుకుంటున్న కేర్. కొత్త రిస్క్ తీసుకోవడం కంటే వస్తున్న జీతాన్ని కాపాడుకోవడం అన్నమాట.

News March 10, 2026

IPL షెడ్యూల్‌పై అప్‌డేట్

image

IPL-2026 షెడ్యూల్‌పై అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 12న బీసీసీఐ సెక్రటరీ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు IANS వెల్లడించింది. తొలుత 20 రోజుల షెడ్యూల్ రిలీజ్ చేస్తారని పేర్కొంది. కాగా మార్చి 28 నుంచి ఈ మెగా క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రెండు దశల్లో లీగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది.