News April 13, 2024
మహబూబ్ నగర్ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

చైత్రమాసం వసంత రుతువు, ఏప్రిల్ 22 పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడప నున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం తెలిపారు. ఈనెల 21 సాయంత్రం 5 గంటలకు MBNR డిపో నుండి బస్సు బయలుదేరి ఏపీలోని కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, 22న సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 94411 62588, 73828 27102 సంప్రదించాలన్నారు.
Similar News
News April 22, 2025
MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 42.1 డిగ్రీలు, నవాబుపేట 42.0 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్తమొల్గర 41.9 డిగ్రీలు, దేవరకద్ర 41.8 డిగ్రీలు, కౌకుంట్ల 41.5 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లి, మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News April 22, 2025
నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్‌లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922 సెకండియర్‌లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST