News November 19, 2025

తిరుపతిలో కలపడం మీకు ఇష్టమేనా..?

image

తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడంలో భాగంగా 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి రూరల్లో 34 పంచాయతీలు ఉండగా ఇందులో 32 గ్రేటర్‌లో విలీనానికి విముఖత చూపాయి. సాయినగర్, న్యూ నగర్ పంచాయతీలు విలీనానికి జైకొట్టాయి. పన్నులు భారీగా పెరుగాయని కొందరు ప్రజలు సైతం గ్రేటర్‌లో కలవడానికి ఆసక్తిచూపడం లేదు. మరి మీరేమంటారు?

Similar News

News December 9, 2025

IPL మినీ వేలం.. 350 మందితో ఫైనల్ లిస్ట్

image

IPL మినీ వేలంలో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి 1,355 మంది పేర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఆ లిస్టును BCCI 350 మందికి కుదించింది. ఈ లిస్టులో తొలుత పేరు నమోదు చేసుకోని 35 మంది కొత్త ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉంది. అతని బేస్ ధర రూ.కోటిగా నిర్ణయించారు. DEC 16న 2.30PMకు అబుదాబి వేదికగా IPL వేలం జరగనుంది.

News December 9, 2025

సంగారెడ్డి: నేడు మొదటి విడత ప్రచారానికి ముగింపు

image

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు ఊరేగింపులు ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదన్నారు.

News December 9, 2025

KMR: శీతల గాలులు వీస్తున్నాయి.. జాగ్రత్త

image

కామారెడ్డి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి మరింత తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. రాత్రి 7 దాటిందంటే శీతల గాలులు వీస్తూ శరీర భాగాలు మంచులా తయారవుతున్నాయి. 75% మంది ప్రజలు పట్టణంలో రాత్రి 9 నుంచి రోడ్లపై కనబడట్లేదు. గ్రామాల్లోనైతే 7గం.ల నుంచే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ప్రజలు ఉదయం, రాత్రి బయటకు రాకపోవడమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.