News April 13, 2024

శ్రీకాకుళం: సందేహాల పై టోల్ ఫ్రీ .. 1950

image

ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపై నైనా సందేహాలు నివృత్తి చేసుకునేందుకు, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబరు 1950ను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఓటరు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు సమాధానం ఇచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు చేసేందుకు ప్రతి పౌరునికి హక్కు ఉంది.

Similar News

News March 16, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤బూర్జ: రోడ్డు పరిహారం ఇవ్వలేదని వినూత్న నిరసన
➤సారవకోట: రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణం ఎలా ?
➤కవిటి: వై.ఎస్ షర్మిల దృష్టికి ఉద్ధానం కిడ్నీ రోగుల సమస్యలు
➤శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు
➤ఎస్పీ గ్రీవెన్స్‌కు 62 వినతులు
➤పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడు మృతి
➤నందిగాం: ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు మహిళ ఎంపిక
➤నరసన్నపేట: తెలుగు పరీక్షకు ఒక విద్యార్థి దూరం

News March 16, 2026

శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 105 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని 145 కేంద్రాల్లో పరీక్షలు జరగగా 28,637 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,532 మంది హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షకు 575 మంది విద్యార్థులకు గాను 85 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.

News March 16, 2026

పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడి మృతి

image

పాతపట్నం – తెంబూరు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు పూరి – గుణుపూర్ రైలు ఢీకొని ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడిది ఒడిశాలోని సింగపూర్ గ్రామస్థుడు భివిషాణ్(29)గా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.