News April 13, 2024

విజయవాడ: జగన్‌పై క్యాట్‌బాల్‌‌తో రాళ్లదాడి

image

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.

Similar News

News January 15, 2025

నందిగామలో దారుణ హత్య

image

నందిగామ మండలం ఐతవరంలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఐతవరం గ్రామం బీసీ కాలనీలో చింతల నాగేంద్రమ్మ (33) అదే గ్రామానికి చెందిన తోగటి హనుమంతరావుతో ఏడాదిగా సహజీవనం చేస్తోంది. కాగా వీరు కొంతకాలంగా తరచుగా గొడవపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాగేంద్రమ్మను హనుమంతరావు హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 15, 2025

విజయవాడ: ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08533 VSKP- SC, నం.08537 VSKP- SC రైళ్లను బుధవారం నడుపుతామని, ఈ రైళ్లలో 9 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయన్నారు. నేడు నం.08533 రైలు మధ్యాహ్నం 3.30కి, నం.08537 రైలు రాత్రి 11.30కి విజయవాడ చేరుకుంటాయన్నారు.

News January 15, 2025

రూ.255 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశాం: సుజనా

image

అమరావతి రైతులకు పెండింగ్ కౌలు నగదు విడుదల చేసిన NDA కూటమి ప్రభుత్వం వారింట సంతోషాలు నింపిందని విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి మంగళవారం ట్వీట్ చేశారు. జగన్ హయాంలో పెండింగ్‌లో ఉంచిన కౌలు నగదు ఒకేసారి రూ.255 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన వారికి న్యాయం చేయటం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం అని సుజనా స్పష్టం చేశారు.