News April 13, 2024

సీఎం జగన్‌పై దాడి.. స్పందించిన చెల్లెలు షర్మిల

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఆయన చెల్లెలు, APCC చీఫ్ షర్మిల ఖండించారు. ‘ఈ రోజు ఎన్నికల ప్రచారంలో సీఎంపై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 17, 2026

HYD: సమ్మర్.. METROనే బెటర్..!

image

పెరుగుతున్న ఎండలతో HYD జనం ఇప్పుడు ఎక్కువగా METROలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. RTCతో పోల్చితే టికెట్ ధరలు ఇంచుమించు ఒకేళా ఉండడంతో మెట్రో జర్నీనే బెటర్ అంటున్నారు. ఇందుకు ముఖ్య కారణాలు సిటీలో పర్సనల్ వెహికిల్‌లో ట్రావెల్ చేయాలన్నా, RTC బస్సులో వెళ్లాలన్నా ట్రాఫిక్ తిప్పలతో పాటు ఉక్కపోత. పైగా గంటలో వెళ్లాల్సిన చోటుకు 20- 30 నిమిషాల్లోనే ACలో వెళ్తుండటంతో చాలామంది వీటినే ప్రిఫర్ చేస్తున్నారు.

News March 17, 2026

ఆరేళ్ల పదవీ కాలం.. ఒక్క ప్రశ్నా అడగలేదు!

image

మాజీ CJI జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ MP పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆరేళ్లలో ఆయన అటెండెన్స్ 53% ఉండగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 2023లో AUGలో ఢిల్లీ సర్వీసెస్ బిల్‌పై చర్చలో మాత్రమే పాల్గొన్నారు. కాగా 2020 మార్చి 16న ఆయనను RSకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ‘నేను ముఖ్యమైన అంశాలు అని భావించినప్పుడు మాట్లాడతాను. నన్ను ఏ పార్టీ నియంత్రించలేదు’ అని 2021లో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

News March 17, 2026

హైదరాబాద్‌లో UK స్కూల్స్!

image

TG: హైదరాబాద్‌లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)కు చెందిన 13 ప్రఖ్యాత స్కూల్స్ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఇందులో భాగంగా యూకే డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 18న రాష్ట్రంలో పర్యటించనుంది. ఎక్కడెక్కడ క్యాంపస్‌లు నెలకొల్పాలనే దానిపై రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనుంది.