News April 14, 2024
మెదక్: నన్ను ఎదుర్కోలేకే నాపై తప్పుడు వార్తలు: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి

“నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులిచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ది పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గుచేటు” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి ఫైరయ్యారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమేనని వ్యాఖ్యానించారు.
Similar News
News March 17, 2026
మెదక్: మెజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న రెండు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్(సెకండ్ క్లాస్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి నీలిమ తెలిపారు. రిటైర్డ్ లేదా రాజీనామా చేసిన జ్యుడీషియల్ అధికారులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కోర్టు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 17, 2026
మెదక్: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాఠశాలలో అటెండర్‌గా పనిచేసిన సారా జైపాల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
News March 17, 2026
RMPT: ఖేలో ఇండియా ఉషు లీగ్‌లో గోల్డ్ మెడల్

నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో రామాయంపేటకు చెందిన జమాల్‌పూర్ హీనా మాధురి గోల్డ్ మెడల్ సాధించింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం ప్రతినిధులు, కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు. తన ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులు సుశీల-మల్లేశంకు మాధురి కృతజ్ఞతలు తెలిపారు.


