News April 14, 2024

ఇండియాకు +91 కోడ్ ఎలా వచ్చిందంటే..

image

భారత్‌లోని ఫోన్ నెంబర్లకు అంతర్జాతీయ కాల్స్ చేయాలంటే నెంబర్‌కు ముందు +91 కలపాల్సి ఉంటుంది. అది ఎలా వచ్చిందో తెలుసా? దేశాలకు ఈ కోడ్‌లను ఐక్యరాజ్యసమితి కేటాయించింది. అందుకోసం వివిధ ప్రాంతాలను 9 జోన్లుగా విభజించింది. వీటిలో 9వ జోన్‌లో ఆసియా, గల్ఫ్ దేశాలున్నాయి. ఈక్రమంలోనే భారత్‌కు +91, పాక్‌కు +92, అఫ్గాన్‌కు +93 వరుసలో కోడ్‌లను కేటాయించింది.

Similar News

News November 17, 2024

‘పుష్ప 2’ ఈవెంట్‌కు సుకుమార్ దూరం.. ఎందుకంటే?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంఛ్ రేపు పట్నాలో జరగనుంది. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటంతో వాటిని ఫినిష్ చేసేందుకు ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారని సమాచారం. మరోవైపు రేపటి ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్ అక్షర్ సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్‌ ఇస్తున్నారు. వచ్చే నెల 5న మూవీ రిలీజ్ కానుంది.

News November 17, 2024

‘ప్రెగ్నెంట్ మ్యాన్’ గురించి తెలుసా?

image

హార్మోన్ లోపం వల్ల కొందరు ట్రాన్స్‌గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆడపిల్లగా పుట్టి, లింగమార్పిడి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చాడనే విషయం మీకు తెలుసా? USకు చెందిన తామస్ బీటీ తన భాగస్వామి నాన్సీని వివాహం చేసుకునేందుకు లింగమార్పిడి చేసుకుంది. ఆ తర్వాత గర్భం దాల్చగా 2008 జూన్‌లో సహజ ప్రసవం జరిగింది. తాను పాలు ఇవ్వలేనని ఆయన చెప్పారు. 2009లో బీటీ మరో బిడ్డకు జన్మనిచ్చారు.

News November 17, 2024

BGT ఆ జట్టే గెలుస్తుంది: హేడెన్

image

ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ జోస్యం చెప్పారు. కోహ్లీ, స్మిత్ వారి జట్లకు కీలకంగా మారతారని చెప్పారు. కమిన్స్, బుమ్రా బౌలింగ్ సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకోవడం గమనార్హం.