News April 14, 2024

HYD: ఊటికి వెళ్లొద్దామా..?

image

HYD నగరంలో ఎండలు బగ్గుమంటున్న వేళ ప్రజలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు,ఊటీ, మైసూర్ ప్యాకేజీని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల నిడివితో కూడిన ఈ టూర్లో టికెట్ ధర పెద్దలకు రూ.11,999, పిల్లలకు రూ.9,599 ఉందని, హోటల్ గదిలో ఒక్కరే ఉంటే టికెట్ ధరకు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News March 7, 2026

HYD: 2026-27 నుంచి NEP 2020 అమలు

image

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి CPGET ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు పేర్కొన్నారు.

News March 7, 2026

HYDలో హాకీ సమరం.. కెప్టెన్లకు ఘన స్వాగతం

image

హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న FIH మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్-2026 వేడుకలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత్, ఇంగ్లాండ్, కొరియా సహా 8 దేశాల కెప్టెన్లకు క్రీడా శాఖ అధికారికంగా స్వాగతం పలికింది. భారత జట్టుకు సలీమా టెటె నాయకత్వం వహిస్తుండగా.. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. భాగ్యనగరంలో అంతర్జాతీయ హాకీ సందడి నెలకొంది.

News March 7, 2026

HYD: అడ్వర్టైజమెంట్లపై కొత్త రూల్స్..!

image

HYD నగర సౌందర్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ‘అవుట్‌డోర్ అడ్వర్టైజమెంట్ పాలసీ-2026’ని అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి హోర్డింగ్‌కు అడ్వర్టైజమెంట్ రెగ్యులేటరీ కమిటీ (ARC) అనుమతితో పాటు క్యూఆర్ కోడ్, జియో-ట్యాగింగ్ తప్పనిసరి. వారసత్వ కట్టడాలు, విద్యాసంస్థల వద్ద ప్రకటనలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు లేకుండానే తొలగించడమే కాకుండా, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.