News April 14, 2024
ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన సంపద.. ఎంపీ ఏమన్నారంటే?

బెంగళూరు సౌత్ నుంచి మరోసారి బరిలో నిలిచిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సంపద భారీగా పెరగడం చర్చనీయాంశమైంది. 2019లో రూ.13.46లక్షలుగా ఉన్న ఆయన సంపద ఐదేళ్లలో 30రెట్లు పెరిగి రూ.4.10కోట్లకు చేరింది. అయితే ఇందుకు కారణం స్టాక్ మార్కెట్లేనని సూర్య చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు కొనసాగిస్తున్నానని, ఇవే తన సంపద పెరిగేలా చేశాయన్నారు.
Similar News
News March 10, 2026
హోటళ్లే కాదు.. హాస్టళ్లలోనూ ఇబ్బందులే!

కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది. గ్యాస్ లేక బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే అనేక <<19341968>>హోటళ్లు<<>> మూతపడ్డాయి. ఇదే సెగ హైదరాబాద్‌కు తాకే ప్రమాదం ఉంది. హాస్టళ్లలోనూ వంట నిలిచిపోతే వేలాది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందిపడనున్నారు. బయట హోటళ్లు కూడా క్లోజ్ అయితే తిండి కష్టాలు తప్పవని నెటిజన్లు వాపోతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు.
News March 10, 2026
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు ఎగిసి 78,205కు చేరగా, నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 24,261 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ 30లో మహీంద్రా & మహీంద్రా (+3.67%), ఇండిగో (+3.21%), ఏషియన్ పెయింట్స్ (+3.13%), మారుతీ (+2.94%) టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు కోలుకోవడం, రూపాయి విలువ మళ్లీ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.
News March 10, 2026
డ్రోన్ వ్యాపారంలోకి ట్రంప్ కుమారులు

US-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ డ్రోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. మిలిటరీ అవసరాల కోసం అటానమస్ డ్రోన్లను తయారు చేసే ‘పవరస్’ సంస్థలో వీరు పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు తండ్రి యుద్ధానికి ఆదేశాలిస్తుంటే మరోవైపు కుమారులు దానికి అవసరమైన ఆయుధాల వ్యాపారంలోకి ప్రవేశించడం ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు.


