News April 14, 2024

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు షురూ

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు ప్రారంభించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో పొరుగు దేశాలైన ఇరాక్, జోర్డాన్ అప్రమత్తమయ్యాయి. ఇరాక్ ఇప్పటికే తమ గగనతలాన్ని క్లోజ్ చేయగా, ఏదైనా ఇరాన్ విమానం తమ గగనతలంలోకి ప్రవేశిస్తే కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. సిరియాలోని తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌ దాడికి దిగుతామని ఇటీవల ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 21, 2026

భారీగా పెరిగిన చికెన్ ధరలు!

image

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు కేజీ రూ.330 వరకు విక్రయాలు జరిగాయి. ఇవాళ ఆ ధర భారీగా పెరిగి రూ.400కు చేరింది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.380-రూ.400 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో రూ.340-350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమూ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ రేట్ ఎంత ఉంది?

News March 21, 2026

కల్తీని అరికట్టేలా.. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ రెడీ!

image

తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ సిద్ధమైంది. ₹25 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్‌ను ఇవాళ CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరకును ఇక్కడే తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు చేయనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఓ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.

News March 21, 2026

గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్!

image

ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులకు అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వర్షాకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది.