News April 14, 2024

బీజేపీకి తలనొప్పిగా మారిన పశ్చిమ యూపీ

image

అయోధ్య రామమందిరం ఊపులో యూపీలోని 80 లోక్‌సభ సీట్లూ గెలవాలనుకుంటున్న బీజేపీకి పశ్చిమ యూపీ తలనొప్పిగా మారింది. గతంలో ఇక్కడ బీజీపీకి మద్దతు వచ్చినా ఈసారి ఆ పరిస్థితి లేదు. రాజ్‌పుత్, త్యాగీ, సైనీ వర్గాలు అసంతృప్తితో ఉండటమే కారణం. ముఖ్యంగా తమ వర్గానికి తక్కువ సీట్లు కేటాయించడంపై రాజ్‌పుత్‌లు పెదవి విరుస్తున్నారట. మరోవైపు ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. <<-se>>#Elections2024<<>>

Similar News

News March 12, 2026

టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

image

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.

News March 12, 2026

సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.

News March 12, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

image

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్‌ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం