News April 14, 2024
NGKL: ఒకేరాత్రి 10 ఇళ్లలో చోరీ

వెల్దండ మండలంలో దొంగలు రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి చెర్కూర్ గ్రామంలో ఏకంగా 10 ఇళ్లల్లో చోరీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోని బీరువాలు పగలగొట్టి రూ.2 లక్షల నగదు, తులంన్నర బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ రవి గ్రామాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.
Similar News
News March 18, 2026
MBNR: LPG సిలిండర్ల సరఫరాపై కంట్రోల్ రూమ్

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటల్స్‌లో డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ నిల్వలపై కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ రెడ్డి 9666052780, అబ్దుల్ జలీల్ 9912659005లను సంప్రదించాలన్నారు.
News March 18, 2026
MBNR: సిలిండర్ల అక్రమ నిల్వలపై నిఘా.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ హరిప్రియ తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వాడినా, నిల్వ ఉంచినా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.
News March 18, 2026
MBNR: ‘తొలిసారిగా డిజిటల్‌లో జనాభా గణన’

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.


