News April 14, 2024
VZM: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా..!

విజయనగరంలో ఈనెల 16న జరగాల్సిన ప్రజాగళం కార్యక్రమం వాయిదా పడినట్లు టీడీపీ కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉండగా.. అనివార్యకారణాలు వలన రావడం లేదని పేర్కొంది. అయితే రేపు రాజాంలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు.. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో రాజాం వస్తారు. అంబేడ్కర్ కూడలిలో సా.3గంటలకు జరిగే సభలో పాల్గొంటారు.
Similar News
News July 10, 2025
నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెట్టాలి: SP

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన చేపట్టాలన్నారు. విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.
News July 9, 2025
గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు: జేసీ

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జ్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్ సమావేశం జేసీ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ సూచనలు, కేటాయించిన బడ్జెట్‌కు అనుగుణంగా, త్వరలో జరగబోయే సర్వసభ్య సమావేశం గురించి, ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో చర్యలు గురించి చర్చించారు.
News July 9, 2025
జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్‌ఐ

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు చెప్పారు. బాలిక ఫిర్యాతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.