News April 14, 2024
IPL: ఇవాళ డబుల్ ధమాకా

ఆదివారం కావడంతో ఇవాళ IPLలో రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతాతో లక్నో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో చెన్నైని ముంబై ఢీకొట్టనుంది. ఈ మ్యాచు కోసం ధోనీ, రోహిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాయింట్ల పట్టికలో కోల్‌కతా 2, చెన్నై 3, లక్నో 4, ముంబై 7వ స్థానంలో ఉన్నాయి.
Similar News
News March 25, 2026
అమరావతిలో అగ్నిప్రమాదాలు.. దర్యాప్తు ముమ్మరం

AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై పోలీసు శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తోంది. ఇటీవల L&T కంపెనీ, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పైపులు దగ్ధమైన సంగతి తెలిసిందే. అయితే అవి 130 డిగ్రీల వేడికి తప్ప చిన్న మంటలకు దగ్ధం కావనేది నిపుణుల అభిప్రాయం. కాగా వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉండొచ్చని <<19466902>>CM అనుమానం<<>> వ్యక్తం చేశారు.
News March 25, 2026
ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

AP: రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ‘ఎల్ నినో’ కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే 2-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. మరోవైపు ఈనెల 28 వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27,28 తేదీల్లో గంటకు 40-60kms వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం సహా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
News March 25, 2026
డీలిమిటేషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది?

రాజ్యాంగం ప్రకారం పదేళ్లకోసారి <<19460921>>డీలిమిటేషన్<<>> (జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు, నియోజకవర్గాల సరిహద్దుల సర్దుబాటు) చేపట్టాలి. గతంలో 1952, 1963, 1973లో చేపట్టారు. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25yrs నిలిపివేశారు. ఆ తర్వాత కూడా అవే పరిస్థితులు ఉండటంతో మరో 25yrs పొడిగించారు. 2002లో డీలిమిటేషన్ చేపట్టినా సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గ పరిధులను మాత్రమే మార్చారు.


