News April 14, 2024

15న ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపిక

image

మహబూబ్ నగర్: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా ఫుట్ బాల్ సీనియర్స్ పురుషుల జట్టు ఎంపికను ఈ నెల 15న ఉదయం 8 గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేపడుతున్నట్లు సంఘం కార్యదర్శి భానుకిరణ్ తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వరకు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

జడ్చర్ల మృతదేహం సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

image

రాష్ట్రవ్యాప్తంగా సంచలమైన సృష్టించిన జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News March 3, 2026

MBNR: జాగ్రత్త..అసత్య ప్రచారాలపై చర్యలు: SP

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు లేదా ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియా వేదికల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరంగా చర్యలకు గురయ్యే అంశాలుగా పరిగణించబడతాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. SHARE IT

News March 3, 2026

ప్రభుత్వ హాస్పిటల్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి: మాజీ మంత్రి

image

జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన నేపథ్యంలో జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ, వంద పడకల హాస్పిటల్‌ను, నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఘటనకు అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.