News April 14, 2024

BREAKING: సీఎంపై దాడి.. ఈసీ కీలక ఆదేశాలు

image

ఏపీ సీఎం జగన్‌పై దాడి ఘటనపై ఈసీ ఆరా తీసింది. విజయవాడ సీపీ కాంతి రాణాకి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. రేపటిలోగా ఘటనపై నివేదిక పంపాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డవారిని త్వరగా గుర్తించాలన్నారు. మరోవైపు సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.

Similar News

News March 20, 2026

ధురంధర్-2 చెత్త సినిమా.. నటి విమర్శలు

image

‘ధురంధర్-2’పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇప్పుడే ధురంధర్-2 సినిమా చూశా. ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇదో చెత్త సినిమా. బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు ఉంది. ఈ మూవీ చూసి సమయం, డబ్బులు వృథా చేసుకోకండి. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, BGM, నటన.. ఏవీ బాలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, దుష్ప్రచారాన్ని ఆపండి’ అని ట్వీట్ చేశారు.

News March 20, 2026

శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

image

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.

News March 20, 2026

ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

image

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.