News April 14, 2024
BREAKING: HYDలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

HYD రాజేంద్రనగర్ ORRపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు ORRపై వేగంగా వెళ్తున్న కారు హిమాయత్‌సాగర్ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
Inter Resluts: HYD విద్యార్థులకు ALERT

నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
రేపు ఇంటర్ రిజల్ట్స్.. HYDలో వెయిటింగ్

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన హైదరాబాద్ జిల్లాలో 244 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2Newsలో<<>> చెక్ చేసుకోండి.
SHARE IT
News April 21, 2025
HYD: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో HYD, RR, MDCL జిల్లాలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.