News April 14, 2024
సర్‌బుజ్జిలి యువకుడి కిడ్నాప్ కలకలం

వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం విశాఖలో క్యాబ్ బుక్ చేసుకొని బీజేపీ కార్యాలయం వద్ద ఉండగా అప్పుడే కారులో ఐదుగురు అతడిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 10, 2026
శ్రీకాకుళం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేశ్ (27) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. ఏడాది క్రితం పలాస మండలానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం కాశీబుగ్గలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News January 10, 2026
SKLM: వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ విజయ సారధి హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేయరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.
News January 10, 2026
SKLM: శ్రీకాకుళం జిల్లాకు మరో 2 వేల టన్నుల యూరియా

జిల్లాకు మరో 2 వేల టన్నుల యూరియా సరఫరా చేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారి కే త్రినాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియాను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుత సీజన్‌లో అన్ని రకాల పంటలకు గాను మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.


