News April 14, 2024

విశాఖ: రైల్వే స్టేషన్లలో తాగునీరు

image

రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని రైల్వే స్టేషన్లలో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ ఫామ్స్ పై తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, స్కౌట్ గైడ్స్, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో సాధారణ బోగీలు వద్ద చల్లని తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News March 10, 2026

విశాఖ రుషికొండలో ‘క్రౌన్ ప్లాజా’ హోటల్

image

విశాఖపట్నం రుషికొండలో ‘కోస్టల్ హాస్పిటాలిటీ ప్రిసింక్ట్’ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ‘క్రౌన్ ప్లాజా’ బ్రాండ్‌తో కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది. సుమారు ₹280.51 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా 310 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పర్యాటక పాలసీ 2024-29లో భాగంగా ప్రభుత్వం భూమిని, ప్రోత్సాహకాలను కేటాయించింది.

News March 10, 2026

పోర్టు రైల్వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

పోర్టులోకి వచ్చే రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు హార్బర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. గూడ్స్ రైలు పోర్ట్‌లోకి వస్తుండగా ఒక్కసారిగా శబ్దంతో కరెంటు పోవడం ఎలక్ట్రికల్ రైలు ఆగిపోవడం గుర్తించిన అప్పారావు అనే వ్యక్తి ఏం జరిగిందని పరిశీలించగా పోల్ పక్కన పడిపోయిన వ్యక్తిని గమనించాడు. వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో హార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 10, 2026

విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

image

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించి అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,35,000 చలానా విధించారు.