News April 14, 2024
పెద్దముడియం: భార్య గొంతు కోసి హత్యచేసిన భర్త

పెద్దముడియం మండలంలోని దిగువ కల్వటాల గ్రామంలో భార్యను ఆమె భర్త గొంతు కోసి హత్య చేశాడు. దిగువ కల్వటాలకు చెందిన ఆదిలక్ష్మికి మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన మేనమామ సహదేవుడితో 15 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదిలక్ష్మి 2 నెలలుగా పుట్టింటి వద్ద ఉంటోంది. భార్య సంసారానికి రాలేదన్న కోపంతో శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆదిలక్ష్మిని భర్త కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.
Similar News
News March 20, 2026
సిద్ధవటంలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

సిద్ధవటంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పర్వదినం (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు సిద్ధవటం శివారులోని ఈద్గాలో జమాఅత్ ప్రారంభమై అనంతరం ప్రత్యేక నమాజ్ నిర్వహించనున్నట్లు ముత్తవల్లి సయ్యద్ నజరే ఆలం ఖాద్రి తెలిపారు. నెల రోజుల పాటు ముస్లింలు పాటించిన కఠోర ఉపవాసాలు నేటితో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
News March 20, 2026
రైతుల నుంచి అధికంగా వసూలు చేస్తే చర్యలు: జ్యోతి

ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాలుకు రూ.75లు మించి వసూలు చేస్తే ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకుంటామని మార్క్ ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి హెచ్చరించారు. ప్రొక్యూర్ మెంట్ కేంద్రాల్లో రైతులందరికీ బహిరంగంగా కనిపించేలా ఛార్జీల వివరాలను, ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
News March 20, 2026
కడప: Way2News ఎఫెక్ట్.. ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

కడప జిల్లాలో మార్క్‌ఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్‌ఛార్జ్‌లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.


