News April 14, 2024
ఈనెల 24వ తేదీ వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు
శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఈ నెల 18 నుంచి 24వ తేదీలోపు చెల్లించాలని డీఐఈఓ రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రథమ ఇంటర్ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షకు 24వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2025
అనంత: అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
నిత్యవసర సరకుల అక్రమ నిల్వలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో నిత్యవసర సరకులను సరఫరా చేస్తోందన్నారు. అవి లబ్ధిదారులకు మాత్రమే అందేలా చూడాలని సూచించారు. అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా ఒక ప్రత్యేక బృందం పని చేస్తోందని తెలిపారు. నిత్యవసర వస్తువులు కేవలం పేదలకు మాత్రమే చేరాలన్నారు.
News January 24, 2025
కూడేరు: జైలు నుంచి దున్నపోతు రిలీజ్
కూడేరు మండలం కడదరకుంట, ముద్దలాపురం గ్రామాల్లో దేవర కోసం రెండు దున్నపోతులను గతంలో వదిలారు. అయితే వాటిలో ఒకటి పారిపోగా.. మరొక దానికోసం రెండు గ్రామాల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో సీఐ రాజు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ దున్నపోతును వారి ఆధీనంలోకి తీసుకున్నారు . కాగా ఇటీవల దేవర ముగియడంతో గురువారం దున్నపోతును వదిలేశారు. ఇక మీదట బలి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
News January 24, 2025
పెండింగ్ పనులను పరిష్కరించండి: కలెక్టర్ చేతన్
శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న రహదారులకు సంబంధించి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రైల్వేలు, అటవీశాఖ, చిన్న నీటిపారుదలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ సమస్యలను వారంలోపు పరిష్కరించాలని ఆదేశించారు.