News April 14, 2024

విజయనగరం: పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.

Similar News

News March 11, 2026

విజయనగరం: పోస్టల్ బీమాతో రూ.15 లక్షల ఆర్థిక సాయం

image

పోస్ట్ ఆఫీసు యాక్సిడెంటల్ పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు అన్నారు. మంగళవారం దత్తిరాజేరులో ప్రమాదవశాత్తు మృతి చెందిన మర్రివలస గ్రామస్థుడు కోరాడ లక్ష్మణ్ రావు కుటుంబానికి రూ.15 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గజపతినగరం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అధికారులు కోరారు.

News March 10, 2026

విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

image

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.

News March 10, 2026

VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

image

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.