News April 14, 2024

NLG: ఓటు నమోదుకు రెండు రోజులే అవకాశం!

image

ఓటరు నమోదుకు ఈనెల 15 వరకే అవకాశం ఉంది. లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటు జాబితాలో పేరు ఉండాలి. అయితే 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు హక్కు పొందని వారు వెంటనే నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత ఉన్నా.. ఓటు రాదని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి రాకుండా ముందస్తుగా తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, బీఎల్వోల వద్ద జాబితా చూసుకోవాలని సూచించారు.

Similar News

News March 13, 2026

వాడపల్లి కేసులో వివరణ కోరిన మానవ హక్కుల సంఘం

image

వాడపల్లి పోలీసుల కస్టడీలో గిరిజన యువకుడు సాయి సిద్ధుపై జరిగిన చిత్రహింసల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది రేవంత్ వెల్లడించారు.

News March 13, 2026

గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం: మంత్రి ఉత్తమ్

image

ఎల్పీజీ గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 288 కేసులు నమోదు చేశామన్నారు.

News March 13, 2026

సాగు, తాగునీటిపై కలెక్టర్ ‘సమీక్ష’

image

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మిర్యాలగూడ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.