News April 14, 2024
సోంపేట: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

సోంపేట మండలం బారువా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం గ్రామం నుంచి బెంకిలి గ్రామానికి టీవీఎస్ మోటార్ సైకిల్‌పై డొక్కరి నరేష్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డొక్కరి నరేష్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలతో బయటపడడంతో.. హైవే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 4, 2026
శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్టే?

ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 న సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో, ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీలు, 657 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ఖరారు సైతం జరగలేదు. ఎన్నికలపై స్పష్టత వచ్చేవరకు ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగనుంది.
News March 4, 2026
శ్రీకాకుళం: పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్ డిప్లమా ప్రవేశాల పరీక్ష పాలిసెట్-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కన్వీనర్ నారాయణరావు బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులుగా చెప్పారు. https://polycetap.ap.gov. ఇన్ వెబ్సైట్లో ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పది కళాశాలలు ఉన్నాయన్నారు.
News March 4, 2026
జనసేన ఆఫీసుపై దాడి.. శ్రీకాకుళం జిల్లా యువకుడి అరెస్ట్

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.


