News April 14, 2024

విశాఖ: ‘రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

విశాఖ జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును పొందాలని కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. ఆఫ్ లైన్‌లో ఆదివారం అర్ధరాత్రిలోగా ఆన్లైన్‌లో, 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొన్నారు. 15 తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని అయితే అవి ఓటరు జాబితాలో ఉండే అవకాశం లేదన్నారు.

Similar News

News March 18, 2026

జీవీఎంసీలో కలెక్టర్ పాలన.. అధికారుల్లో గుబులు

image

జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కార్పొరేషన్ నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో పరిపాలన సాగనుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్చరికలు, మెమోలు ఇచ్చినా మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పాలనాపగ్గాలు చేపట్టడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇటీవల పలు జోన్లలో ఏసీబీ తనిఖీలు జరగడం గమనార్హం.

News March 18, 2026

విశాఖ: గంజాయి పట్టివేత.. కానిస్టేబుళ్ల అరెస్ట్

image

గంజాయి తరలిస్తున్న ఐదుగురిని విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిలో VZM జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండడం గమనార్హం. కారులో 10 కేజీల గంజాయి తరలిస్తుండగా భీమిలి పరిధి దాకమర్రికి సమీపంలో వీరిని అరెస్ట్ చేశామన్నారు. కానిస్టేబుళ్లు శివప్రసాద్(ఎస్. కోట), వి.రాంబాబు (వేపాడ), ఇ.సతీశ్(కొత్తవలస) స్టేషన్లకు చెందిన వారిగా మిగిలిన వారిని పి.శివకృష్ట, జి.గోపిగా గుర్తించారు.

News March 18, 2026

విశాఖ: ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ

image

జీవీఎంసీకి బకాయి ఉన్న ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే వడ్డీ‌పై 50% రాయితీ పొందవచ్చు అని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. నగరవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు అవుతున్నప్పటికీ స్థానికేతర గృహ బకాయిలు ఉండిపోతున్నాయని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు జీవీఎంసీ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.