News April 14, 2024

నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు:

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి నియోజవర్గ కేంద్రాలకు నియోజవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. మే 13న జిల్లాలో పోలింగ్ జరుగనుండగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల ద్వారా పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్నామన్నారు.

Similar News

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

అనంత: ఈ రోజు నుంచి ఉచితం

image

గర్భాశయ కాన్సర్‌ను నిర్మూలించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు DMHO దేవి తెలిపారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు ముందస్తుగా HPV టీకాలు బుధవారం నుంచి వేస్తామన్నారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలు 16,449 మంది ఉన్నారన్నారు. వారికి సరిపడా డోసులు ముందస్తుగానే జిల్లాకు చేరాయన్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ.3,989 కాగా వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు.