News April 14, 2024
బాపట్ల జై భీమ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కోటయ్య

అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్యను జై భీమ్ రావు భారత్ పార్టీ బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. బాపట్ల పార్లమెంటులో అత్యధిక ఓట్లతో పార్టీని అగ్రస్థానంలో నిలబెట్టాలని కోటయ్యకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల గొంతుకగా ఓటర్ల ఓట్లను అభ్యర్థిస్తానని కోటయ్య తెలిపారు.
Similar News
News October 7, 2025
తెనాలి: ఆ కేసులోనూ అతడు ముద్దాయి..!

అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో A-12 ముద్దాయిగా ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి, తెనాలి ఐతానగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటరు గొట్టిముక్కల సుధాకర్‌పై జరిగిన దాడి కేసులోనూ శ్రీనివాసరావు A-11 ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం.
News October 6, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జులై నెలలో జరిగిన ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ రెగ్యులర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల సర్వ నియంత్రణ అధికారి ఆచార్య ఆలపాటి శివప్రసాద్ సోమవారం విడుదల చేశారు. పరీక్షలు వ్రాసిన 73మంది విద్యార్థులకు గాను 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ లోపు రూ.1860 నగదు చెల్లించాలన్నారు.
News October 6, 2025
అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు భూ కేటాయింపులు..?

అమరావతి రాజధానిలో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు భూమి కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు CRDA మొత్తం ఐదు ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు భూ కేటాయింపులు జరిపినట్లు సమాచారం. వాటిలో పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్ – 3 ఎకరాలు, చిన్మయ మిషన్ స్కూల్ – 3 ఎకరాలు గ్లెండేల్ అకాడమీ – 5 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం – 5 ఎకరాలు, మోంట్‌ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ – 3 ఎకరాలు (స్థల క్లియరెన్స్ జరుగుతోంది).