News April 14, 2024
దాడి వెనక టీడీపీ నేతల హస్తం: VSR

AP: సీఎం జగన్ మీద దాడి ఘటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై దాడి వెనక టీడీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హింస ద్వారా TDP అధికారంలోకి రావాలని చూస్తోందని దుయ్యబట్టారు. సీఎంపై దాడి హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ సమగ్ర విచారణ జరపాలని కోరారు.
Similar News
News March 24, 2026
రాజస్థాన్ రాయల్స్ విక్రయం!

IPL ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికా వ్యాపారవేత్త కల్ సొమానీ కొనుగోలు చేశారు. మెజారిటీ వాటాదారు ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ నుంచి రూ.15,300 కోట్ల($1.63B)కు ఆయన ఆధ్వర్యంలోని కన్సార్షియం సొంతం చేసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ఈ IPL సీజన్ నుంచే ఇది అమల్లోకి రావచ్చని చెప్పింది. టోర్నీ చరిత్రలో ఇదే బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది. మనోజ్ బదాలే(ఎమర్జింగ్ మీడియా వెంచర్స్)కు RRలో 65% వాటా ఉంది.
News March 24, 2026
TDP ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు అన్యాయం: బొలిశెట్టి

AP: TDP MLAలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు న్యాయం జరగడం లేదని ఆ పార్టీ MLA బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ‘మా MLAలు ఉన్న చోట TDPకి ప్రాధాన్యమిస్తున్నాం. మాకూ అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం. CBN, లోకేశ్ సహకరిస్తున్నా కింది స్థాయిలో అలా లేదు. త్వరలో సమన్వయ సమావేశంలో చర్చిస్తాం. పార్టీలో ఉన్న అసంతృప్తిపై JSPLP భేటీలో పవన్ దృష్టికి తీసుకెళ్లాం’ అని వెల్లడించారు.
News March 24, 2026
దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్‌కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా PM మోదీ పిలుపునిచ్చారు. వార్ ఇంపాక్ట్ చాలా కాలం ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు.


