News April 14, 2024
బోధన్ చక్కెర కర్మాగారం తెరిపిస్తా: జీవన్ రెడ్డి

రానున్న లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నవీపేటలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలిస్తే మెుదటగా బోధన్ నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని అన్నారు. బీదర్ -బోధన్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృష్ చేస్తామని ప్రకటించారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు క్వింటాకు రూ. 15 వేల మద్దతు ధర కల్పిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
Similar News
News September 10, 2025
NZB: GGHలో వైద్య విభాగాలను తనిఖీ చేసిన DMHO

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వివిధ వైద్య విభాగాలను DMHO డాక్టర్ బి.రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షయ నియంత్రణ, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ విభాగం, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని, SNCU విభాగాన్ని పరిశీలించారు. సిబ్బంది పనితీరును హాజరు పట్టికలను వివిధ రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు.
News September 10, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: NZB కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామన్నారు.
News September 10, 2025
నిజామాబాద్: వృద్ధురాలి హత్య

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.