News April 14, 2024
14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో

బీజేపీ ‘సంకల్ప పత్ర’ మేనిఫెస్టోలో 14 అంశాలను పొందుపరిచింది.
* విశ్వబంధు *సురక్షిత భారత్ *సమృద్ధ భారత్ * గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ * ప్రపంచ స్థాయి మౌలిక వసతులు *ఈజ్ ఆఫ్ లివింగ్ * సాంస్కృతిక వికాసం *సుపరిపాలన * స్వస్థ భారత్ *అత్యుత్తమ శిక్షణ *క్రీడా వికాసం *సంతులిత అభివృద్ధి *సాంకేతిక వికాసం *సుస్థిర భారత్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
Similar News
News March 24, 2026
KCR నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే: రేవంత్

కేసీఆర్‌తో తనకు వ్యక్తిగత సమస్యలు లేవని, ఆయన రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని TG సీఎం రేవంత్ TV9 సమ్మిట్‌లో తెలిపారు. కేసీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని విమర్శించారు. హరీశ్ రావు సీఎం అవుతా అన్నారని, వారసత్వ రాజకీయాల కోసం ఆ ఫ్యామిలీ పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్నదే తన లక్ష్యమని, BRS, BJP కలిసి వస్తే ఇద్దరినీ ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News March 24, 2026
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

రాబోయే 2-3 గంటల్లో మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, HYD, BHPL, KNR, ASF, MBNR, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాగా ఇప్పటికే HYDలో వర్షం కొనసాగుతోంది. అటు ఏపీలో రేపు అల్లూరి, పోలవరం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది.
News March 24, 2026
డీలిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలి: రేవంత్

TG: దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని BJP అనుకుంటోందని CM రేవంత్ ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TV9 సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘ఏ లెక్క ప్రకారం 50% సీట్ల పెంపు ఉంటుంది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికే నష్టం. సీట్ల పెంపుపై చర్చ జరగాలి. 50% పెంపులోనే కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు పోరాటానికి సిద్ధం కావాలి’ అని పిలుపునిచ్చారు.


